ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ అంశం ఇవాళ ఓ కొలిక్కి వచ్చేలా ఉంది. హైబ్రిడ్ మోడల్‌కు పాక్ క్రికెట్ బోర్డు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, మిగతా టోర్నీల్లో తాము ఆడే మ్యాచ్‌లకూ హైబ్రిడ్ మోడల్లోనే జరగాలని కోరినట్లు సమాచారం. దీంతో జై షా నేతృత్వంలో ఇవాళ సాయంత్రం జరగనున్న సమావేశంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.