ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌పై ఆసీస్ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘భారత్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పింక్ బాల్‌తో 40 ఓవర్ తరువాత కూడా స్వింగ్ చేయడం నేను ఇప్పటివరకు చూడలేదు. అది కేవలం స్టార్క్‌కు మాత్రమే సాధ్యం. అతడు ఒక పింక్ బాల్ మాంత్రికుడు’ అని తెలిపాడు.