ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులో భారత స్టార్ పేసర్ బుమ్రా ఫిట్‌నెస్‌పై అభిమానుల్లో సందేహాలు వచ్చాయి. ఆసీస్ ఇన్నింగ్స్‌లో 81వ ఓవర్ వేసిన బుమ్రా కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో అభిమానుల్లో కంగారు మొదలైంది. అయితే ఫిజియో సహాయం తీసుకున్న అతడు ఆ ఓవర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా బౌలింగ్ కంటిన్యూ చేసి.. కమిన్స్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.