• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

స్పెషల్ ఫ్లైట్ వార్తలపై కోహ్లీ రియాక్షన్ ఇదే

తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి కోహ్లీ తెరదించాడు. IPL మ్యాచ్‌ల విరామ సమయంలో లండన్ వెళ్లిరావడానికి ప్రత్యేక విమాన సౌకర్యం కల్పించాలని కోహ్లీ RCB యాజమాన్యాన్ని కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్‌ను కోహ్లీ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. దానికి రెండు నవ్వుతున్న ఎమోజీలను జతచేశాడు. దీంతో ఆ వార్తలన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేశాడు.

March 23, 2026 / 02:40 PM IST

RR జట్టుపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు

రాజస్థాన్‌ రాయల్స్ జట్టుపై అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదని అశ్విన్ వ్యాఖ్యానించాడు. అతడి మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదని అన్నాడు. వైభవ్‌ను కట్టిడి చేసేందుకు ప్రత్యర్థి జట్లు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతాయని పేర్కొన్నాడు. అలాగే, కెప్టెన్‌గా జడేజాకు అవకాశం ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

March 23, 2026 / 02:19 PM IST

IPL కెప్టెన్: అటు రహానే.. ఇటు పరాగ్

IPL 19వ సీజన్‌లో అన్ని జట్లను భారత ప్లేయర్లే నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ 10 మందిలో అత్యధిక వయసు గల కెప్టెన్ అజింక్యా రహానే-KKR కాగా.. పిన్న వయస్కుడిగా రియాన్ పరాగ్-RR నిలిచాడు. గతేడాది RRను 8 మ్యాచుల్లో నడిపించిన పరాగ్.. ఈ సారి పూర్తిస్థాయి బాధ్యతలతో బరిలోకి దిగుతున్నాడు. అటు సారథిగా రహానేకి ఇది 4వ సీజన్(RR-2018 & 19, KKR-2025).

March 23, 2026 / 12:56 PM IST

IPL-2026: MI ఫుల్ స్క్వాడ్

బ్యాటర్లు: రోహిత్, సూర్య, రాబిన్ మిన్జ్, షెఫ్రాన్ రూథర్‌ఫోర్డ్, రికెల్టన్, డీకాక్, డానిష్ మలేవార్, తిలక్ఆల్‌రౌండర్లు: హార్దిక్(C), నమన్ ధిర్, శాంట్నర్, రాజ్ అంగద్, అథర్వ అంకొలేకర్, మయాంక్ రావత్, కార్బిన్ బాష్, విల్ జాక్స్, శార్దూల్బౌలర్లు: ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, రఘు శర్మ, మహ్మద్ ఇజర్, అల్లా ఘజన్ఫర్, బుమ్రా.

March 23, 2026 / 09:06 AM IST

జనవరిలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ

భారత జట్టు వచ్చే ఏడాది జనవరి-మార్చిలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో 5 టెస్ట్‌ల ‘బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ’ సిరీస్ ఆడనుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా నిన్న తమ 2026-27 క్యాలెండర్‌ను ప్రకటించింది. ఇందులో BGT కూడా ఉండగా.. పూర్తి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. డిసెంబర్-మార్చిలో ఆసీస్ బిజీబిజీగా ఉండనుంది. 14 వారాల్లో మొత్తం 10 టెస్ట్‌లు ఆడనుంది.

March 23, 2026 / 08:06 AM IST

IPL 2026: ఆకాశ్ స్థానంలో దూబే

నడుము నొప్పితో బాధపడుతూ KKR ప్లేయర్ ఆకాశ్ దీప్ IPL 2026 సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో KKR అతని స్థానంలో విదర్భ పేసర్ సౌరభ్ దూబేని తీసుకుంది. గతంలో అతణ్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకున్నా.. డగౌట్‌కే పరిమితమయ్యాడు. దీంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని అద్భుతమైన డెబ్యూ చేయాలని దూబే భావిస్తున్నాడు.

March 23, 2026 / 06:55 AM IST

క్ష‌మాప‌ణ చెప్పిన‌ PCB ఛైర్మ‌న్‌ నఖ్వీ

పశ్చిమాసియా యుద్ధం పాకిస్తాన్ సూప‌ర్ లీగ్(PSL) పై ప్ర‌భావం చూపిస్తోంది. MAR 26 నుంచి ప్రారంభం కానున్న PSL ప్రేక్ష‌కులు లేకుండానే జ‌రగ‌నుంది. యుద్ధం కార‌ణంగా ప్రేక్షకులు రావడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో PCB ఛైర్మ‌న్ మోసిన్ న‌ఖ్వీ క్రికెట్ అభిమానుల‌కు క్ష‌మాప‌ణ చెప్పాడు.

March 22, 2026 / 09:04 PM IST

ధోనీ వల్లే కోహ్లీ సక్సెస్ అయ్యాడు: మాజీ క్రికెటర్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్‌పై మాజీ సెలెక్టర్ MSK ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒకానొక సమయంలో కోహ్లీ ఫామ్ కోల్పోయి, ఫిట్‌నెస్ విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టాలనుకున్నారు. కానీ ధోనీ ఒక్కడే కోహ్లీకి అండగా నిలబడి, విరాటే భారత క్రికెట్ భవిష్యత్తు అని నమ్మి అవకాశాలు ఇచ్చాడు’ అని వెల్లడించాడు.

March 22, 2026 / 07:02 PM IST

IPL: తొలిసారి అందరూ భారత కెప్టెన్లే

IPL చరిత్రలో తొలిసారిగా పది జట్లకూ భారత ఆటగాళ్లే సారథ్యం వహిస్తున్నారు. ప్యాట్ కమిన్స్ జట్టుకు దూరం కావడంతో SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ వ్యవహరిస్తుండగా.. రియాన్ పరాగ్ (RR), రుతురాజ్(CSK), రజత్ పాటిదార్(RCB)లతో పాటు హార్దిక్(MI), శ్రేయస్(పంజాబ్), గిల్(గుజరాత్), రహానే(KKR), పంత్(LSG), అక్షర్(ఢిల్లీ) వంటి స్వదేశీ స్టార్ల నాయకత్వంతో ఈసారి ఐపీఎల్ పూర్తిగా భారతీయమయమైంది.

March 22, 2026 / 04:55 PM IST

‘250 కొట్టినా వేస్టే.. SRH బౌలింగ్ ఫ్లాప్’

IPL-2026లో SRH బౌలింగ్ విభాగంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటర్లు 250 రన్స్ చేసినా, బౌలర్లు అన్నే ఇచ్చేలా ఉన్నారని అన్నాడు. ప్రస్తుతం బ్రైడన్ కార్స్ ఒక్కడే పోరాడుతున్నాడని పేర్కొన్నాడు. కమిన్స్, మలింగా వంటి దిగ్గజాలు లేకపోవడం జట్టుకు పెద్ద లోటని, కేవలం భారత బౌలర్లపైనే ఆధారపడటం రిస్క్ అని అభిప్రాయపడ్డాడు.

March 22, 2026 / 03:26 PM IST

కొవిడ్.. దారుణంగా ట్రోల్ చేశారు: వరుణ్

తన IPL కెరీర్‌లో 2021 సీజన్ అత్యంత దారుణమైనందని వరుణ్ చక్రవర్తి పేర్కొన్నారు. ‘కొవిడ్ సోకిన తొలి ప్లేయర్ నేనే. భుజం నొప్పితో బయోబబుల్ నుంచి బయటకు రావడంతో నాకు, నా నుంచి సందీప్ వారియర్‌కు సోకింది. ఆపై టోర్నీని మధ్యలో ఆపేశారు’ అని గుర్తుచేశాడు. దీంతో తమకు వినోదమిచ్చే IPL తన వల్లే ఆగిపోయిందంటూ అభిమానులు దారుణంగా ట్రోల్ చేశారని.. ‘బతికే ఉన్నావా’ అనేవారని తెలిపాడు.

March 22, 2026 / 01:59 PM IST

IPL: ఇప్పటికైనా కల నేరవేరేనా?

ఢిల్లీ, పంజాబ్.. IPL తొలి సీజన్ 2008 నుంచి ట్రోఫీ అందుకోలేకపోయిన జట్లు. కెప్టెన్లు, కోచ్‌లు, ప్లేయర్లు.. ఆఖరికి టీమ్ పేరు మార్చినా ఫలితం లేకపోయింది. 2020లో DC రన్నరప్‌గా నిలవగా.. 2014 & 25లో పంజాబ్ ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఇక 17 ఏళ్లు ఇదే లిస్టులో ఉన్న RCB గతేడాదే PBKSని ఓడించి తమ తొలి కప్ గెలిచింది. మరి IPL 2026లో అయినా ఈ జట్ల కల నెరవేరుతుందేమో చూడాలి.

March 22, 2026 / 11:53 AM IST

విమర్శకులకు కోహ్లీ అన్నీ గుర్తుచేస్తాడు: కైఫ్

చివరిగా న్యూజిలాండ్‌పై JAN 18న వన్డే ఆడిన కోహ్లీ.. 20 ఓవర్ల IPL గేమ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇలా ఆట నుంచి బ్రేక్ తర్వాత వేరే ఫార్మాట్‌లో ఆడటం మిగతావారికి కష్టం కానీ కోహ్లీ రాణించగలడని మహ్మద్ కైఫ్ అన్నాడు. దూకుడుగా కాకుండా నిలకడగా ఆడుతున్నాడని.. ఇకపై ఆడినంత కాలం తన విమర్శకులకు తాను విరాట్ కోహ్లీ అని గుర్తుచేయాలని కింగ్ ఫిక్స్ అయ్యాడని కైఫ్ చెప్పుకొచ్చాడు.

March 22, 2026 / 11:25 AM IST

‘బాబర్, అఫ్రిది.. కొన్నాళ్లు క్రికెట్ ఆడకండి’

పాక్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఇద్దరూ ఆట నుంచి బ్రేక్ తీసుకోవాలని పాక్ మాజీ కెప్టెన్ అజర్ ఆలీ సూచించాడు. బాబర్ 6 నెలలు, అఫ్రిది 3 నెలలు జట్టుకు దూరంగా ఉండాలని.. అప్పుడే ఫిట్‌నెస్, ఫామ్ పొందగలరని పేర్కొన్నాడు. కాగా T20 WC 2026లో బాబర్ 4 ఇన్నింగ్స్‌ల్లో 91 రన్స్ చేయగా.. అఫ్రిది 5 మ్యాచుల్లో 9 వికెట్లు తీశాడు.

March 22, 2026 / 11:05 AM IST

PSL నుంచి వైదొలిగిన మరో ప్లేయర్

PSL 2026 నుంచి ఆసీస్ ప్లేయర్ జేక్ మెక్‌గుర్క్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ‘రావల్‌పిండిజ్’ (కొత్త) టీమ్ ధ్రువీకరించింది. కాగా IPL 2024 & 25లో ఢిల్లీకి ఆడిన ఈ టాపార్డర్ బ్యాటర్.. ఇటీవలి వేలంలో అమ్ముడుపోలేదు. అయినప్పటికీ గాయపడినవారి స్థానంలో IPL 2026లో ఆడే ఛాన్స్ లేకపోలేదు. ఇక చార్లెస్ జాన్సన్(WI) తప్పుకోవడంతో కరాచీ కింగ్స్ రీజా హెండ్రిక్స్(SA)ని తీసుకుంది.

March 22, 2026 / 10:28 AM IST