టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జనవరి నెలకు గాను ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు రేసులో నిలిచాడు. న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు గాను అతడిని ఈ అవార్డుకు నామినేట్ చేశారు. సూర్యతో పాటు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్, న్యూజిలాండ్ బ్యాటర్ డారల్ మిచెల్ కూడా ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు.