ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో బీసీసీఐ పట్టు వదలడం లేదు. తమకు ఆటగాళ్ల భద్రతే ముఖ్యమని తేల్చి చెప్పింది. దీంతో బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ యూసఫ్ పఠాన్ దీనిపై స్పందించాడు. బీసీసీఐ ఎప్పుడూ ఆటగాళ్ల రక్షణ గురించే ఆలోచిస్తుందని పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో బీసీసీఐ నిర్ణయం సరైందేనని.. దేశంలోని ప్రతిఒక్కరం స్వాగతిస్తాం అని వెల్లడించాడు.