టీ20 వరల్డ్కప్-2026 సూపర్-8లో భాగంగా నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఓటమి పాలైంది. ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామన్నాడు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడంతోనే మ్యాచులో వెనుకబడ్డామని, ఆ తర్వాత ఫామ్లోకి రాలేకపోయామని చెప్పాడు. పవర్ ప్లేలో బ్యాటింగ్ మెరుగ్గా చేసుంటే ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్నాడు.