దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 పోరులో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. గత టీ20 వరల్డ్కప్ ఫైనల్స్లో దక్షిణఫ్రికాపై అక్షర్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని, దాన్ని మరిచిపోయారా అని నిలదీశాడు. నిన్న అతడిని ఆడించాల్సిందని అభిప్రాయపడ్డాడు.