188 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 4 బంతుల్లోకే డకౌట్‌గా వెనుదిరిగాడు. మార్క్రమ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రికల్టన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ తన తొలి బంతికే ఫోర్ బాదాడు. తిలక్ వర్మ కూడా 2 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.