సౌతాఫ్రికాతో మ్యాచ్లో బుమ్రా మూడు వికెట్లతో చెలరేగి అరుదైన రికార్డు సృష్టించాడు. T20 WC చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా బుమ్రా (33) అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు అశ్విన్ (32) పేరిట ఉండగా, బుమ్రా దానిని అధిగమించాడు. మరోవైపు, ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన అర్ష్దీప్ (32) కూడా రెండో స్థానంలో నిలిచాడు.