టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో శ్రేయస్ రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు. అయ్యర్ తన పునరాగమనంలో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో ఆ బాధ్యతలను ముంబై క్రికెట్ అసోసియేషన్ అయ్యర్‌కు అప్పగించింది.