SRH స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ఈ IPL సీజన్లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన 5 మ్యాచ్‌ల్లో వరుసగా 31, 52, 62, 39, 40 పరుగులతో మొత్తం 224 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ (200 పరుగులు)ని వెనక్కి నెట్టి క్లాసెన్ ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. అలాగే, SRH కెప్టెన్ ఇషాన్ కిషన్ 213 పరుగులతో రెండో స్థానానికి చేరుకున్నాడు.