భారత్‌లో మనపై ఆడిన నాలుగు టీ20ల్లోనూ వెస్టిండీస్ ఓటమి పాలైంది. అయితే, నాలుగుసార్లూ విండీస్ తొలుత బ్యాటింగ్ చేయడం గమనార్హం. కోల్‌కతా వేదికగా 2018లో ఐదు వికెట్ల తేడాతో, చెన్నైలో 2018లో ఆరు వికెట్ల తేడాతో, హైదరాబాద్‌లో 2019లో ఆరు వికెట్ల తేడాతో, కోల్‌కతా వేదికగా 2022లో ఆరు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై టీమిండియా విజయం సాధించింది.