BCCI చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ ఏడాది జూన్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో, అతడి పదవీకాలాన్ని మరోసారి పొడిగించే అవకాశం ఉన్నట్లు BCCI వర్గాలు పేర్కొన్నాయి. అగార్కర్ హయాంలో భారత్ 2024 T20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 T20 ప్రపంచకప్‌లను గెలుచుకుంది. ఈ విజయాల నేపథ్యంలో, 2027 వన్డే ప్రపంచకప్ వరకు అతడి సేవలను వినియోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.