ఢిల్లీతో మ్యాచ్లో లక్నో సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ తొలి బంతికే KL రాహుల్ని ఔట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో టోర్నీలో తన తొలి బంతికే అత్యధికంగా 5 సార్లు వికెట్ తీసిన ఆటగాడిగా షమీ దూసుకెళ్తున్నాడు. షమీ మినహా ఎవరూ ఇలా 3+ వికెట్లు తీయలేకపోవడం గమనార్హం. ప్రవీణ్ కుమార్, ఉమేష్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ, భువనేశ్వర్, అశోక్ దిండా మూడేసి సార్లు ఈ ఫీట్ సాధించారు.