IPL మాజీ ఛైర్మన్ లతిత్ మోదీ టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. 2007 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌పై ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు బాదిన అనంతరం యువీకి.. లలిత్ మోదీ కారు కొనిచ్చాడు. ఆయనకు యువీ తన బ్యాట్‌ను గిప్ట్గా ఇచ్చాడు. తాజాగా ఆ ఘటనను మోదీ గుర్తు చేసుకుంటూ.. ఆ బ్యాట్ 50 పోర్షే కార్ల కంటే విలువైనదని అన్నాడు.