IPL 2026: ముంబైతో మ్యాచ్లో RCB ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒకే ఓవర్లో 22 పరుగులు రాబట్టాడు. MI ఆల్రౌండర్ మిచెల్ శాంట్నర్ వేసిన 5వ ఓవర్ తొలి 3 బంతులను సిక్సర్లుగా బదిన సాల్ట్.. తర్వాతి బంతిని ఫోర్ కొట్టాడు. అయితే తర్వాతి 2 బంతులను శాంట్నర్ చాకచక్యంగా డాట్స్ వేయగలిగాడు. ఇక పవర్ ప్లే ముగిసేసరికి RCB స్కోర్ 71/0 కాగా క్రీజులో సాల్ట్(47), కోహ్లీ(22) ఉన్నారు.