U-19 ఆసియాకప్లో UAEపై భారత్ 234 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, వైభవ్ సూర్యవంశీ (171) భారీ సెంచరీతో 433/6 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో, యూఏఈ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమైంది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు.