పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో RCB ప్లేయర్లు ‘గ్రీన్ జెర్సీ’ ధరించనున్నారు. ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. ప్రతి ఏటా ఒక మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీ ధరించి RCB ఈ ‘గో గ్రీన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.