KDP: గండికోట ఉత్సవాలను పురస్కరించుకుని కడప నగరంలో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలతో సాగిన ర్యాలీ నగర వీధుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈనెల 11,12,13 తేదీల్లో జరగనున్న ఉత్సవాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
W.G: తాడేపల్లిగూడెం పట్టణంలోని శ్రీ బస్సులమ్మ అమ్మవారి ఆలయంలో లక్ష గాజుల పూజా కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే అమ్మవారి కృపతో ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుఖసమృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
WNP: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లో వదిలి వెళ్ళిన యజమాని లేని 130 వాహనాలను జిల్లా పోలీస్ కార్యాలయం సాయుధ దళ పోలీస్ కార్యాలయంలో ఉన్నాయని ఎస్పీ సునీత రెడ్డి ప్రకటనలు తెలిపారు. పోలీస్ యాక్ట్ 1861లోని సెక్షన్ 26 ప్రకారం ఈ వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు ప్రతిపాదించామని తెలిపారు. మరిన్ని వివరాలకు 8712670601 సంప్రదించాలని ఆమె కోరారు.
NDL: నంద్యాలకు రైల్వే పిట్ లైన్ కోసం కృషి చేస్తున్నానని శనివారం ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. రైల్వే పిట్ లైన్ ఏర్పాటు వల్ల నంద్యాల వాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పిట్ లైన్ అనేది నియమించబడిన ఒక ట్రాక్ అని, దీనివల్ల రైల్వే సిబ్బంది రైలు కింద సులభంగా పనిచేయవచ్చన్నారు.
AP: కోనసీమ జిల్లా ఇరుసుమండలో 5 రోజుల క్రితం సంభవించిన ONGC బ్లోఅవుట్ మంటలు ఎట్టకేలకు పూర్తిగా ఆరిపోయాయి. మంటలకు దగ్ధమైన భారీ మెషినరీ శకలాలను క్రేనుల సహాయంతో ONGC సిబ్బంది తొలగించింది. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు వాటర్ అంబ్రెల్లాతో పాటు గ్యాస్ బావి వద్ద అమర్చేందుకు బ్లోఅవుట్ ప్రివెంటర్‌ను సిద్ధం చేశారు.
ATP: గుత్తి కోట రైల్వే స్టేషన్‌లో శనివారం ఆటో కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని IOW నాగేశ్వర్ నాయక్, మున్సిపల్ మేనేజర్ రాంబాబు నిర్వహించారు. గుత్తి కోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వే, మున్సిపల్ అధికారులు, సంరక్షణ సమితి సభ్యులు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
BDK: మణుగూరు మండలం ఏడూర్ల బయ్యారంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన సర్పంచ్‌ల సన్మాన సభ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని బూర్గంపాడు గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైనా మందా నాగరాజు దంపతులని నూతన వస్త్రాలు అందజేసి సన్మానించారు.
MDCL: సంక్రాంతి పండుగ వేళ స్పెషల్ బస్సుల్లో 50% చార్జీలు పెంచి వసూలు చేయడంపై పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక అన్నోజిగూడ నుంచి ఉప్పల్ రూ.40 వసూలు చేస్తున్నారని, సాధారణ సమయాల్లోనూ గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సుల ధరలు తలకు మించిన భారంగా మారుతున్నట్లుగా పలువురు సోషల్ మీడియా వేదికగా ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
W.G: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయ కమిటీ సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. అనంతరం ప్రసాదరాజు మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.
PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పండుగలు, సెలవుల సమయంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. తలుపులు, కిటికీలు, గేట్లు సక్రమంగా మూసి ఉన్నాయా పరిశీలించాలన్నారు. సీసీటీవీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.
VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శనివారం తులసి దళ అర్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఇద్దరు ఉభయదాతలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
ASF: జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేశ్ శనివారం MP నాగేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కెరమెరి మండలంలోని ఉమ్రి X రోడ్ నుంచి పరంధోలి తండా వరకు BT రోడ్డు నిర్మించాలని, పరంధోలి, ముకదంగూడ గ్రామాలకు త్రీఫేస్ విద్యుత్ అందించాలని కోరారు. అలాగే శంకర్ లోద్ది, మహారాజ్ గూడలో మొబైల్ సిగ్నల్ సమస్య తీర్చడానికి BSNL టవర్లు ఏర్పాటు చేయాలన్నారు.
ADB: తెలంగాణ రాష్ట్ర ప్రోగ్రెసివ్ రికగ్నైస్ టీచర్స్ యూనియన్ సంస్థ ముద్రించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌లను శనివారం నెరడిగొండ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా యూనియన్‌కు సంబంధించి పలు విషయాలను ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సంఘం నాయకులు, తదితరులు ఉన్నారు.
NGK: కల్వకుర్తి మున్సిపాలిటీ 19వ వార్డు సుభాష్ నగర్‌కు చెందిన ఐదు మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసిడింగ్ పత్రాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ శనివారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
BHPL: సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగరవేయడంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని BHPL జిల్లా విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో పతంగులు ఎగరవేయవద్దని, బహిరంగ మైదానాల్లో మాత్రమే ఎగరవేయాలని సూచించారు. కాటన్ మాంజాలు మాత్రమే వాడాలని, నైలాన్, మెటాలిక్ మాంజాలు ప్రమాదకరమని తెలిపారు.