PLD: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో నరసరావుపేట ఎంపీ తావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కూటమి పాలన, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర నిధులపై అమిత్‌షాతో చర్చించారు. అదే విధంగా పార్లమెంట్లో తన ప్రసంగానికి సంబంధించి ప్రాధాన్యత అంశాలను ఆయన తెలియజేసినట్లు స్థానిక ఎంపీ కార్యాలయం పేర్కొంది.
NLR: రంజాన్ పండుగ సందర్భంగా ఆత్మకూరు ఈద్గా ప్రాంతంలో నమాజుకు సిద్ధం చేస్తున్నారు. ముళ్ల కంపలతో నిండుకున్న ఈద్గా ప్రాంతాన్ని మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేశారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ సర్దార్ ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తూ సిబ్బందికి సూచనలు చేశారు. రానున్న రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణం నిర్వహించుకోవాలని ఆయన కోరారు.
ATP: జిల్లా నలంద డిగ్రీ కళాశాలలో ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, నలంద కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 10, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హు లన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
SS: గోరంట్ల మండలం గౌనివారిపల్లి గ్రామం నందు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలు నాటికీ మన వైసీపీ పార్టీని ప్రతి ఒక్కరం కలిసి బలోపేతం చేయాలనీ సూచించారు.
SKLM: కవిటి మండలం బైరాగిపుట్టుగకు చెందిన బోధన్ ప్రధాన్ అనే విద్యార్థి నవోదయ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో LKG నుంచి 5వ తరగతి వరకూ చదివి నవోదయ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం పట్ల మండల విద్యాశాఖాధికారి మజ్జి ధనుంజయ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది విద్యార్థిని అభినందించారు.
KMM: ఖమ్మం నగరానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.188 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య తెలిపారు. ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, మేయర్ నేతృత్వంలో ఈ బడ్జెట్ ను ఆమోదించినట్టు తెలిపారు. వరదలు నియంత్రణ, డ్రైనేజీ అభివృద్ధి, టౌన్ ప్లాన్ తదితర అంశాలకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ATP: పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు పాలీసెట్ 2025కు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి 28 వరకు S.K ప్రభుత్వ పాఠశాలలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ అష్రఫ్ అలీ తెలిపారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే శిక్షణ కొనసాగుతుందన్నారు.
AP: శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి భారీగా కన్నడ భక్తులు తరలివస్తున్నారు. పాదయాత్రగా కన్నడిగులు నల్లమల అడవుల నుంచి వస్తున్నారు. ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు శ్రీశైలం క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరపనున్నారు. భారీగా వస్తున్న భక్తుల రద్దీతో ఇప్పటికే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కాగా రేపటి నుంచి 31 వరకు స్వామివారి స్పర్శదర్శనానికి అనుమతిలేదు.
KMM: నగరంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల జువాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బూర్గుల కవితకు కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మొహ్మద్ జాకీరుల్లా మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ అధ్యాపకులకు డాక్టరేట్ రావడం సంతోషంగా ఉందన్నారు.
MNCL: జన్నారం మండలంలో 132 కెవి సబ్స్టేషన్ నిర్మించాలని మండల ప్రజలు కోరారు. జన్నారం మండలం పూర్తిగా వ్యవసాయ రంగం మీద ఆధారపడింది. దీంతో విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతుంది. అయితే విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో తరచూ విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నాయి. మండలంలో 132 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
ADB: తాంసి మండల కేంద్రంలో మట్కా నిర్వహిస్తున్న ఇద్దరిని పట్టుకున్నట్లు తాంసి ఎస్సై రాధిక తెలిపారు. చింతల వార్ శైలేష్ స్థానికంగా మట్కా నిర్వహిస్తుండగా పట్టుకొని విచారించగా ఆన్లైన్ ద్వారా మట్కా నిర్వహిస్తున్నానని తనతోపాటు పాండ్ర అజ్జు భాయ్ అనే వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిపాడు. రూ.29,360లు, ఒక మొబైల్ మట్కా చిట్టీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
TPT: నాగలాపురం గ్రామపంచాయతీకి సంబంధించి 2025-26 సంవత్సరానికి సంబంధించి షాపింగ్ గదులకు బుధవారం ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రమేశ్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి వారపు సంత, కూరగాయల మార్కెట్, ప్రైవేటు బస్టాండు, జంతువధశాలకు వేలం నిర్వహిస్తామన్నారు. పాల్గొనువారు సాల్వెన్సీ సర్టిఫికెట్‌తో పాటు డిపాజిట్ చెల్లించాలన్నారు.
CTR: ఎమ్మెల్యే కార్యాలయం లక్ష్మీనగర్ కాలనీలోని ప్రజాదర్బార్‌లో బుధవారం ప్రజాఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గురజాలజగన్ మోహన్ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం కార్యకర్తే అధినేత కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
CTR: బొలెరో వాహనం ఢీకొని కార్వేటి నగరంనికి చెందిన యువకుడు మంగళవారం మృతి చెందారు. కేపీ అగ్రహారానికి చెందిన రవి(26) తిరుపతిలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని బైకుపై వస్తుండగా వెదురుకుప్ప మండలం చిన్నపోడు చేను సమీపంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.