NLR: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 11, 2026 న విడవలూరు హైస్కూల్‌లో ఉదయం 8 గంటల నుంచి రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్విరాన్‌మెంట్ మెనెజ్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి తెలిపారు. ఈ రక్తదాన శిబిరాన్ని విడవలూరు రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. రక్తదానం చేయడంలో యువత ముందు ఉండాలని పిలుపునిచ్చారు.
TPT: సూళ్లూరుపేటలో ఇవాల్టి నుంచి జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ మొదటి ఘట్టం శోభాయాత్రకు నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని హోలీ క్రాస్ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవలతో కలిసి ఆయన ర్యాలీగా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ వరకు వెళ్లారు. ఈ శోభాయాత్రలో మహిళలు, అధికారులు పాల్గొన్నారు.
VKB: కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ చెందిన రామయ్య (55)ను చిట్యాల వెంకటయ్య, శ్రీనివాస్, ఆనంద్‌లు దూషించి కొట్టారు. దీంతో అతడు మనస్థాపానికి గురై రాత్రి సమయంలో ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి భార్య సత్యమ్మ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
ATP: గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్‌ఎస్ స్టేట్ బ్యాంక్ సమీపంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో శనివారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, ఆరోగ్య అవగాహన శిబిరం నిర్వహించారు. ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. నిపుణులైన వైద్యులు రోగులకు పరీక్షలు చేసి అవసరమైన సలహాలు ఇచ్చారు.
KDP: కడప వైఎస్ఆర్ జిల్లాలో గండికోట ఉత్సవాలు జరపడం అభినందనీయమని అయితే సిద్ధవటం లోని మట్లి రాజుల కోటను మరవడం, నిర్లక్ష్యం చేయడం శోచనీయమని DCC మాజీ అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్ అన్నారు. గండికోట ఉత్సవాలఖర్చులో 20 శాతం నిధులు సిద్ధవటం కోట అభివృద్ధికి ఖర్చు చేస్తేచాలని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరులో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటీఎఫ్) రాష్ట్ర 51వ మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహాసభలలో పాల్గొనేందుకు అద్దంకి నుంచి శనివారం యుటీఎఫ్ కార్యకర్తలు ప్రత్యేక వాహనంలో తరలి వెళ్లారు. ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారంలో యుటీఎఫ్ అగ్రగామిగా పోరాడుతుందని యూనియన్ రాష్ట్ర కౌన్సిలర్ జయ బాబురావు అన్నారు.
అన్మమయ్య: సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రజలు తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ సూచించారు. సెలవుల్లో దొంగతనాలు జరగకుండా అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాత్రి గస్తీ, పెట్రోలింగ్ మరింత పటిష్టం చేయాలని కూడా ఆదేశించారు.
VZM: వేపాడ(M) సోంపురం జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మండల ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా సమన్వయకులు శ్రీరామమూర్తి, ఎల్ కోట ఎంఈఓ కూర్మారావు శుక్రవారం పరిశీలించారు. అనంతరం విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. వందరోజుల యాక్షన్ ప్లాన్‌పై ప్రగతిని సమీక్షించారు.
MBNR: పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో TSTU నూతన క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం నాయకులు పాల్గొన్నారు.
PLD: నరసరావుపేట కోడెల స్టేడియంలో జిల్లా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సంప్రదాయ క్రీడా వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే అరవింద బాబు ఈ పోటీలను ప్రారంభించి, క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా కర్ర సాము చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. సంప్రదాయాల పరిరక్షణకు, యువతలో క్రమశిక్షణ పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
ELR: భీమడోలు మండలం పూళ్ళు గ్రామంలో పలు ప్రాంతాల్లో శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. భీమడోలు ఇన్‌స్పెక్టర్ యు జే విల్సన్ మాట్లాడుతూ.. జూదం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతాయని, ప్రజలు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలన్నారు. కోడి పందేల నిర్వహణ కోసం సిద్ధం చేసిన బరిలను ధ్వంసం చేశారు.
ప్రకాశం: ఒంగోలు నుంచి విజయవాడ వైపు వెళుతున్న కారు శనివారం మద్దిపాడు వద్ద లారీని క్రాస్ చేస్తుండగా ప్రమాదానికి గురైంది. వేగాన్ని అధిగమించలేక కారు లారీకి అడ్డు రాగా, లారీ కారును కొంత దూరం ఈడ్చుకు వెళ్ళింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
KNR: సంక్రాంతి వేళ నిషేధిత చైనా మాంజా విక్రయించినా, వాడినా కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం హెచ్చరించారు. నైలాన్ దారాల వల్ల పక్షులు, వాహనదారులకు ప్రాణాపాయం ఉందని, వీటిపై నిఘాకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
SRPT: నూతనకల్ మండలం వెంకెపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొమ్ము వెంకన్న అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. తుంగతుర్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి వారి పార్థివదేహానికి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.