కృష్ణా: గుడివాడ గౌతు లచ్చన్న విగ్రహం సమీప ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. తాగునీటి సరఫరా సమయంలో ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు. డ్రైన్ క్రాస్ వద్ద ఉన్న హౌస్ హోల్డ్ వాటర్ కనెక్షన్ను పరిశీలించి, సమస్య ఉంటే తక్షణమే పరిష్కరించాలని సూచించారు.