SKLM: నరసన్నపేట మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శనివారం పర్యటించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద స్వచ్ఛ ఆంధ్ర దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం చెత్త సేకరణ పరిశీలిస్తారని ఎంపీడీవో మధుసూదనరావు ప్రకటనలో తెలిపారు.
HYD: మియాపూర్‌లో తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం మియాపూర్‌లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ అభిమానులు ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంపేట వెళ్లే హైటెన్షన్ రోడ్‌లోని సోనీ గార్డెన్‌ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం ప్రారంభం అవుతుందన్నారు. స్మారకోపన్యాసం, అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.
కడప: శుక్రవారం జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామానికి చెందిన రైతు గుడ్ల నగేష్‌కు చెందిన గొర్రె రెండు తలల గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. రైతు గుడ్ల నగేశ్ పశు సంవర్ధక శాఖ వైద్యులను సంప్రదించారు. గ్రామంలోని రైతులు, ప్రజలు ఈ గొర్రె పిల్లను చూసేందుకు ఆసక్తి చూపారు. రెండు తలలతో గొర్రె పిల్ల జన్మించడం చాలా అరుదని స్థానికులు తెలిపారు.
విశాఖ ఉక్కు రెక్కల ఆయుధాలతో రాష్ట్రం కొత్త శిఖరాలకు ఎదుగుతుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర నిర్ణయం లక్షలాది జీవితాలను మారుస్తుందన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం సత్ఫలితాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కేంద్రం ప్యాకేజీతో విశాఖ ఉక్కుకు పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
MDK: అటవీశాఖ మంత్రి కొండా సురేఖ శనివారం చేగుంట మండలంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటలకు వడియారంలోని ఓ ఫంక్షన్ హాల్లో చేగుంట, నార్సింగి మండలాల లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబా రక్ చెక్కులు పంపిణీ చేస్తారన్నారు. అనంతరం గొల్లపల్లిలో నిర్మించిన విద్యుత్తు ఉపకేంద్రాన్ని ప్రారంభిస్తారన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పటికీ రూ.35 వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. 18 వేల కోట్ల రూపాయలు బ్యాంకులో రుణాలతో పాటు రూ.17 వేల కోట్ల ముడి సరుకు సరఫరా చేసిన సంస్థలకు బకాయిలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్ నష్టాలను పూర్తిస్థాయిలో అధిగమించేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తామని కుమారస్వామి తెలిపారు.
MDK: నర్సాపూర్ జవహర్ విద్యాలయం(వర్గల్)లో 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశాలకు శనివారం ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు క్లస్టర్ స్థాయి అధికారి డాక్టర్ రవి, బ్లాక్ అధికారి తారాసింగ్‌లో ఒక ప్రకటనలో తెలిపారు. బీయూపీ ఎస్ 216, విష్ణు ఉన్నత పాఠశాలలో 173 మంది పరీక్షలు రాయనున్నారు. నిర్ణీత సమయానికి పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని స్టీల్ సీఐటీయు గౌరవ అధ్యక్షులు అయోధ్యరాం డిమాండ్ చేశారు. శుక్రవారం స్టీల్ ప్లాంట్ వద్ద మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ఆర్థిక ప్యాకేజీ అందించడం ప్రజల విజయంగా పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్ విలీనం చేయాలన్నారు. అలాగే సొంత గనులు కేటాయించాలన్నారు.
VSP: పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐనాడ గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.12,650 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
VSP: చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగే నవోదయలో ఆరో తరగతి ప్రవేశానికి జరిగే పరీక్షలకు రెండు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవి తెలిపారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఒక కేంద్రానికి తను, రెండవ కేంద్రానికి పాఠశాల టీచర్ స్వామి ఇన్చార్జిగా వ్యవహరిస్తామన్నారు.
VSP: పద్మనాభ మండలం మద్దిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన జిత్తిక అప్పన్న (35) రోడ్డుపై నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అప్పన్న అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
SDPT: తొగుట మండలంలో శనివారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి దుబ్బాక ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు ఎమ్మెల్యే నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని హబ్సిగూడలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. హోర్డింగ్ కిందకు దింపుతుండగా ఘటన జరిగింది. మృతులు సూర్యాపేట జిల్లా కేసముద్రానికి చెందిన బాలు, మల్లేష్‌గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ప్రకాశం: టంగుటూరు మండలంలోని కందులూరులో నందమూరి తారక రామారావు వర్ధంతిని శనివారం నిర్వహించనున్నట్లు టీడీపీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాంతోపాటు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రజలు అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
NLG: ప్రజా సంఘాలకు మద్దతుగా ఉండి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం కోరారు. శుక్రవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో ప్రజాసంఘాల సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.