NTR: మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమి రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏప్రిల్ 4న జాబ్ మేళా నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ల రవి శనివారం తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్ మీడియెట్, ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. జాబ్ మేళాలో 20కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.
PLD: గురజాల నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల గురజాల నగర పంచాయతీ ఛైర్మన్‌గా నూతన బాధ్యతలు చేపట్టిన షేక్ బడే జానీ శనివారం పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే యరపతినేని కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. గురజాల నగర పంచాయతీ అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు.
KDP: శిల్పారామంలో ఉగాది పండుగను పురస్కరించుకొని సంబరాలు జరుపుతున్నట్లు శిల్పారామ పరిపాలనాధికారి కృష్ణ ప్రసాద్ తెలిపారు. శనివారం కడప స్టేట్ గెస్ట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఉగాది, రంజాన్‌ను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నాగాంజనేయ శర్మచే పంచాంగ శ్రవణం ఉంటుందన్నారు.
గుంటూరు, కృష్ణ జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కేఎస్ లక్ష్మణరావు పదవీకాలం శనివారంతో పూర్తయింది. ఈ నేపథ్యంలో గత ఆరేళ్లుగా సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు ఆదివారం తెలిపారు. భవిష్యత్తులో ప్రజాప్రయోజనాలు, ప్రజల సమస్యలు కోసం వివిధ పద్ధతులలో పని చేస్తానని ఆయన తెలిపారు. ఇప్పటికీ మొత్తం 14ఏళ్లు ఎమ్మెల్సీగా అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు.
NTR: కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో నిర్వహించిన DEC 2024 MSC, MBA, MCA 1, 3వ సెమిస్టర్ (2024-25 విద్యా సంవత్సరం) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 15వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని KRU పేర్కొన్నారు.
SKLM: జిల్లా పోలీసు కార్యాలయంలో రేపు జరగాల్సిన గ్రీవెన్స్ రద్దు చేసినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రంజాన్ కారణంగా గ్రీవెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి, రాకుండా ఉండాలని సూచించారు. తదుపరి గ్రీవెన్స్ వచ్చే సోమవారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కృష్ణా: గోసాల శ్రీవేంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యాన పెనమలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 31న ఉచిత యోగా శిక్షణ నిర్వహించనున్నట్లు సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు 28 రోజులు శిబిరం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఔత్సాహికులు 9133306804 నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
NTR: ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) వడగాలులకు గురవ్వకుండా ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఈ మేరకు తమ అధికారిక X ఖాతా ద్వారా శనివారం ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది . జి.కొండూరు 40.5, విజయవాడ అర్బన్ 40.5, రూరల్ 40.4, ఇబ్రహీంపట్నం 40.7, కంచికచర్ల 40.9లో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని APSDMA అధికారులు తెలిపారు.
SKLM: జిల్లా కేంద్రంలో రోటరీ క్లబ్ సమీపంలో శ్మశాన వాటిక వద్ద శనివారం పోలీసులు దాడులు చేశారు. ఈ సోదాల్లో 9 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నుంచి 21 కిలోల గంజాయితో పాటు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను శనివారం మీడియా సమావేశంలో డీఎస్పీ వివేకానంద వివరించారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు.
NTR: వేసవి రద్దీకి అనుగుణంగా విజయవాడ మీదుగా నరసాపురం(NS)-SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07153 NS-SMVB రైలును ఏప్రిల్ 4 నుంచి మే 2 వరకు ప్రతి శుక్రవారం, నం. 07154 SMVB-NS మధ్య నడిచే రైలును ఏప్రిల్ 5 నుంచి మే 3 వరకు ప్రతి శనివారం నడుపుతామన్నారు.
శ్రీకాకుళం: పట్టణ పరిధిలోని డీఈవో కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం ముట్టడి కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల 10 తరగతి పబ్లిక్ పరీక్షలలో సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులు, డిబార్ అయిన విద్యార్థులకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డీఈఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు.
SKLM: టీడీపీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఢిల్లీలో పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. టీడీపీ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దశదిశలా చాటుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పోరడతుంది.
SKLM: శ్రీ విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది, పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలను జిల్లా ప్రజానీకానికి జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉగాది తెలుగు కొత్త సంవత్సరంలో అన్ని కుటుంబాల్లో ఆనందాన్ని, సంతోషాలను నింపాలని కోరారు. అలాగే ముస్లిం కుటుంబాల్లో ఈ రంజాన్ పండుగ శాంతి, ప్రేమ, ఐక్యతకు ప్రతీకగా నిలవాలని ఎస్పీ ఆకాంక్షించారు.
మార్చి 30వ తేదీని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇడ్లీ మొదట ఇండోనేషియాలో పులియబెట్టిన ఆహారంగా ఉద్భవించింది. ఇది క్రీస్తుశకం 800-1200లో భారతదేశానికి వచ్చింది. కాలక్రమేణా ఇడ్లీ దక్షిణ భారతదేశ ప్రధాన వంటకంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది. ఇడ్లీలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల తేలికగా జీర్ణం అవుతుంది.
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై తడబడుతోంది. తిలక్ వర్మ (39), సూర్యకుమార్ యాదవ్ (48) మినహా మిగతా బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. ప్రస్తుతం ముంబై 15 బంతుల్లో 68 పరుగులు రాబట్టాల్సి ఉంది.