SRCL: ముస్తాబాద్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా బొప్ప నర్సయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ.. సంఘ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానన్నారు. నర్సయ్యను రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య ఘనంగా సత్కరించారు.