ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ కిషన్, గ్రామస్థుల ఆధ్వర్యంలో గురువారం పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించి, ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలవాలని పేర్కొన్నారు.