నెల్లూరు: మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ త్యాగాన్ని దేశమంతా గుర్తు పెట్టుకుంటుందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని వీపీఆర్ నివాసంలో వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి వారు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.