NGKL: రామ్ నగర్ కాలనీలో కొలువైన శ్రీ సీతారామస్వామిఆలయంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు శాస్త్రక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వరదరాజన్ అయ్యంగారి ఆధ్వర్యంలో జరిగిన వ్రతాలలో 12మంది దంపతులు పాల్గొన్నారు. స్వామివారి వ్రతాలు ఆచరించడంద్వారా దరిద్రం తొలగి విశేషఫలితం పొందుతారని అయ్యగారు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ చేపట్టారు.