సంగారెడ్డి: కోహీర్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గడిల హానిక EAPCET పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. రాష్ట్ర వ్యాప్తంగా 692 ర్యాంక్ సాధించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు గడిల నవీన, గడిల శ్రీనివాస్ రెడ్డి ఆనందంతో ఉప్పొంగి పోయారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహం, కృషితో మంచి ర్యాంకును సాధించగలిగానని హానిక తెలిపింది. ఆమెను గ్రామస్తులు అభినందించారు.