MNCL: పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ట్రైకార్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సూచించారు. సోమవారం జన్నారంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కాంగ్రెస్ నాయకులతో కలిసి వారు శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో పెరిగిన పిచ్చి చెట్లు, ముళ్ల పొదలను తొలగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.