JGL: పోలాండ్ దేశంలోని పిస్కీ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్యాలకు చెందిన పొన్నం మనోజ్ గౌడ్(29) మృతిచెందాడు. సోమవారం ఉదయం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొని మృతి చెందినట్లు సమాచారం. 5నెలల క్రితమే స్వదేశానికి వచ్చి వెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు. మనోజ్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.