W.G: ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను ఉండవల్లి వారి నివాసంలో సోమవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కలిశారు. తణుకు నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా లోకేష్ పలు సమస్యలకు వెంటనే పరిష్కారం సూచించారు. అలాగే మరికొన్ని సమస్యలను తప్పక పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ ఎమ్మెల్యేకు హామీ ఇచ్చినట్టు తెలిపారు.