BPT: బాపట్ల కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ జే.వెంకట మురళి స్వయంగా ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు ఇతర వ్యక్తిగత సమస్యలపై ప్రజలు కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడారు.