SRPT: నడిగూడెం మండలం సిరిపురం క్లస్టర్ రైతు వేదిక వద్ద ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను ఏఈఓ రేణుక సోమవారం ప్రారంభించారు. రైతుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేసి ప్రతి రైతుకు 11 అంకెల ఫార్మర్ ఐడి కేటాయిస్తామని ఆమె తెలిపారు. దీని ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ రాయితీలు అందుతాయని చెప్పారు.