AKP: మాకవరపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పీ.చాయసుధ సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. మండలం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఛాయసుధను మండల వైసీపీ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.