SKLM: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సాంకేతిక సహాయకుడిగా పనిచేస్తున్న కె. రమేష్ (36) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. స్థానిక ఏపీవో టి. పార్వతి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పచ్చకామెర్లు వ్యాధితో రమేష్ బాధపడుతున్నాడని తెలిపారు. విశాఖలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ.. ఈ రోజు మృతి చెందారని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి 15 వేల ఆర్థిక సహాయం అందజేశారు.