NZB: సీఎం రేవంత్ రెడ్డి మాటల వెనక ఆక్రోశం, బాధ వేరే ఉందని బీఆర్ఎస్ నేత కవిత అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం మాట్లాడారు. గతంలో టీజీఐఐసీలో 1.75 లక్షల ఎకరాలను కేసీఆర్ అందుబాటులో ఉంచారు. ఇప్పుడు ఆ భూములను కుదవ పెట్టాలని చూస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం రూ.1.80 కోట్ల అప్పులు చేసిందన్నారు.