NLG: జిల్లా కేంద్రంలోని సాగర్ రెడ్డి కళ్యాణ మంటపంలో ఆదివారం రాత్రి ఎస్పీ శరత్ చంద్ర పవార్ బందోబస్తుపై పోలీసు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాగార్జున సాగర్‌కు సోమవారం ప్రపంచ సుందరీ పోటీదారులు వస్తున్న సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నల్గొండ పోలీస్ ఖ్యాతి పెంచే విధంగా పని చేయాలని సిబ్బందికి సూచించారు.