NLG: నాగార్జునసాగర్‌లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును మిస్ వరల్డ్ పోటీదారులు సోమవారం సందర్శించనున్నారు. బుద్ధ జయంతి రోజే ఈ సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషం. వీరు సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు ఇక్కడ పర్యటిస్తారు. విదేశాల్లోని బౌద్ధ పర్యాటకుల్ని ఆకర్షించడం లక్ష్యంగా అధికారులు బుద్ధవనాన్ని ఎంపిక చేశారు.