HYD: హైదరాబాద్ మెట్రోకు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ మెట్రోపై పరిశోధన పత్రాన్ని సమర్పించింది. ప్రపంచంలోనే ఎంతో పేరొందిన అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య(PPP) ప్రాజెక్టు అంటూ అందులో ప్రముఖంగా ప్రస్తావించింది. మెట్రో మ్యాన్‌గా పేరొందిన HMRL ఎండీ NVS రెడ్డి నైపుణ్య శైలిని, నాయకత్వ లక్షణాలను ప్రధానంగా ప్రస్తావించింది.