NDL: శ్రీశైల మల్లన్న ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. మల్లికార్జున స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు కావటంతో రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో స్వామివారికి ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. స్పర్శ దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.