ప్రకాశం: జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ వెలిగండ్ల మండలం వెదుళ్ళ చెరువు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు శ్యామల కాశిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, తెలుగు రైతు అధ్యక్షులు కేలం ఇంద్ర భూపాల్ రెడ్డి పలువురు టీడీపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.