VSP: అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అన్ని దుర్మార్గాలకు పాల్పడుతుందని, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవహరిస్తుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పెల్ల నాగేశ్వరరావు అన్నారు. విశాఖలో ఆదివారం జరిగిన సీపీఐ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల చిచ్చుపెట్టి తమ వైపు తిప్పుకొని ప్రతిసారి బీజేపీ కేంద్రంలో అడుగుపెడుతుందని అన్నారు.