TPT: పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యల 523వ వర్థంతి మహోత్సవాన్ని 15న తిరుమలలో టీటీడీ నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించనున్నారు.