NLG: హైదరాబాద్లోని బీ.డీ రెడ్డి ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన వింజమూరు గ్రామానికి చెందిన చంద సత్యనారాయణ కుమార్తె లహరిక వివాహ వేడుకల్లో దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, కేతావత్ బిల్యా నాయక్ పాల్గొన్నారు. వారు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, స్థానిక సర్పంచ్ దాసు ఉన్నారు.