NLG: చందంపేట మండలం పాత కంబాలపల్లిలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 26న సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండడంతో ఆలయ కమిటీ సభ్యులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు తాగునీరు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.