KRNL: వెల్దుర్తి పట్టణంలోని సర్వే నంబర్లు 465, 565/Aకు చెందిన ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ సీపీఐ నాయకులు ఇవాళ రీ సర్వే కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సీపీఐ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని పలుమార్లు MRO కార్యాలయానికి వినతిపత్రాలు అందజేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు.