VZM: కవయిత్రి ఆతుకూరి మోల్లమాంబ (మొల్ల) జయంతి కార్యక్రమంను రేపు ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సదరు కార్యక్రమమునకు అధికారులు, ప్రజాప్రతినిధులు, బి.సి. సంఘ సభ్యులు, ప్రజలు హాజరు కావలసినదిగా కోరారు.