KMM: వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన 700 కుటుంబాల్లో 311 మందికి పట్టాలు ఇచ్చి మిగిలిన బాధితులకు పట్టాలు ఇవ్వకపోవడం సరైన విధానం కాదని CPI ML న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారు ఐలయ్య ఆరోపించారు. బాధితులందరికీ పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ఇళ్ల కూల్చివేత వల్ల నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.